స్పానిష్ ఫుట్‌బాల్ జట్టు వాలెన్సియా క్లబ్.. తమ సిబ్బందిలో దాదాపు 35 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పింది. గతనెలలో మిలాన్(ఇటలీ) ఆడేందుకు వెళ్లి వచ్చిన తర్వాతే ఇలా జరిగిందని పేర్కొంది. ఇందులో ఐదుగురు ఆటగాళ్లు, నలుగురు ఇతర సభ్యులు ఉన్నారు. వారంతా ప్రస్తుతం నిర్బంధంలో, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పింది.
ఆ జట్టులో మూడో వంతు సభ్యులకు కరోనా - వాలెన్సియా ఫుట్‌బాల్
వాలెన్సియా ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన సభ్యుల్లో మూడో వంతకుపైగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడిస్తున్నారు.
ఆ జట్టులో మూడో వంతు సభ్యులకు కరోనా
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ టోర్నీలు రద్దయ్యాయి. ఐరోపాలో జరగాల్సిన ఐదు సాకర్ లీగ్‌లు.. ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లను ఆపేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో దాదాపు 1,80,000 మందికి కరోనా సోకగా.. 7,000 మందికి పైగా ఈ వైరస్ వల్ల చనిపోయారు.
ఇదీ చూడండి.. భయం భయం.. క్రీడారంగంపై కరోనా ప్రభావం