ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఒక ప్రెస్ మీట్లో చేసిన ఒక చిన్న పని (GESTURE) కోకా కోలా కంపెనీకి రూ.30 వేల కోట్లు నష్టం తెచ్చిపెట్టింది. యూరో కప్‌లో భాగంగా మంగళవారం ప్రెస్‌మీట్‌కు వచ్చిన రొనాల్డో తన ముందు ఉన్న కోక్ బాటిల్‌ను పక్కకునెట్టాడు. అందుకు కారణం లేకపోలేదు.
రొనాల్డో దెబ్బకు కోకాకోలా కంపెనీకి 30వేల కోట్ల నష్టం - రొనాల్డో దెబ్బకు కోకోకోలా కంపెనీకి 30వేల కోట్ల నష్టం
ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియనో రొనాల్డో చేసిన ఓ చిన్న పని కోకా కోలా కంపెనీకి రూ.30 వేల కోట్ల నష్టం తెప్పించింది. అదేంటి అనుకుంటున్నారా. అయితే పూర్తి కథనం చదివేయండి.
రొనాల్డో హెల్త్, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ నేపథ్యంలో అతడు కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు చాలా దూరంగా ఉంటాడు. వాటి ప్రకటనల్లోనూ ఇతడు కనిపించడు. అయితే యూరో కప్(Euro Cup 2021)కు కోకా కోలా(Coca Cola) కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రెస్మీట్లో ఆ బాటిల్స్ ఉంచారు. అది గమనించిన రొనాల్డో అక్కడి నుంచి బాటిల్‌ను తీసేసి.. 'వాటర్ తాగండి' అంటూ అందరికీ చెప్పాడు. అంతే.. ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడం, కోకా కోలా కంపెనీకి భారీ నష్టాలు రావడం చకచకా జరిగిపోయాయి.
యూరో కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0 తేడాతో హంగేరీపై విజయం సాధించింది. 83 నిమిషాల పాటు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే 84వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు రాఫెల్ గురియో గోల్ చేసి పోర్చుగల్‌కు ఆధిక్యత అందించాడు. ఆ తర్వాత 87వ నిమిషంలో రొనాల్డో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. మళ్లీ రొనాల్డోనే ఆఖరి నిమిషంలోమరో గోల్ చేయడం వల్ల పోర్చుగల్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించి యూరో కప్‌ను గెలుపుతో ఆరంభించింది.