పోర్చుగల్‌కు చెందిన సాకర్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డొ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ఫుట్‌బాల్ కెరీర్‌లో చేసిన అత్యుత్తమ గోల్ కంటే తన ప్రేయసి జార్జినా రోడ్రిగెజ్‌తో శృంగారమే ఉన్నతమైందని పేర్కొన్నాడు.
2018 ఏప్రిల్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున ఆడిన రొనాల్డొ... జువెంటాస్‌పై చేసిన ఓవర్ హెడ్ కిక్ గోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడు రొనాల్డొ.
" నా ప్రేయసితో పోల్చినప్పుడు అది అత్యుత్తమ గోల్ కాదు. ఓవర్‌హెడ్ గోల్ చేసేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. మాములుగా 700 గోల్స్ చేసుంటాను. కానీ ఎప్పుడూ దానిని చేయలేదు. జువెంటాస్‌పై సాధించినప్పుడు హమ్మయ్య! ఎట్టకేలకు చేశానని అనుకున్నాను. ఛాంపియన్స్ లీగ్‌లో గియానలుగిపై చేసిన ఆ గోల్ అత్యంత అందమైంది".
-- రొనాల్డొ, సాకర్ క్రీడాకారుడు
గూసీ షాప్‌లో మోడల్ జార్జినాతో తొలి చూపులోనే ప్రేమలో పడినట్లు రొనాల్డొ వివరించాడు. ఇప్పటికే వీరిద్దరి పర్యవేక్షణలో నలుగురు పిల్లలు ఉన్నారు. ఏదో ఓ రోజు కచ్చితంగా వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు రొనాల్డొ వెల్లడించాడు.
ప్రేయసి జార్జినా, పిల్లలతో రొనాల్డొ