ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ టోర్నీ అయిన ఛాంపియన్స్ లీగ్‌లో చెల్సీ విజేతగా నిలిచింది. ఈ సీజన్ ఫైనల్లో ఆ జట్టు 1-0 తేడాతో మాంచెస్టర్ సిటీ ఎఫ్‌సీపై విజయం సాధించింది.
ఛాంపియన్స్ లీగ్ ఛాంప్ చెల్సీ - Football tournament
ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ టోర్నీ ఛాంపియన్స్ లీగ్‌లో చెల్సీ జట్టు విజయం సాధించింది. తొమ్మిదేళ్ల తర్వాత చెల్సీ ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం.
ఛాంపియన్స్ లీగ్ ఛాంప్ చెల్సీ
హవెర్జ్ (42వ నిమిషంలో) గెలుపు గోల్ కొట్టాడు. లీగ్ మధ్యలో కరోనా బారిన పడ్డ అతను.. దాని నుంచి కోలుకుని వచ్చి జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. తొమ్మిదేళ్ల తర్వాత చెల్సీ ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం. తుదిపోరులో చెల్సీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రత్యర్థిని గోల్స్ చేయకుండా నిలువరించడంలో విజయవంతమైంది.
ఇదీ చూడండి French Open: థీమ్ ఇంటికి.. ఒసాకాకు జరిమానా