'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ.. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆగ్రహానికి గురై రిఫరీని(Referee Football) కొట్టబోతాడు. అయితే.. అంతకుమించిన ఘటన తాజాగా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జరిగింది. ఏకంగా మ్యాచ్ మధ్యలోనే ఓ ఫుట్‌బాలర్(Brazilian Footballer) రిఫరీని చితకబాదాడు. అసలేమైందంటే!
ఇదీ జరిగింది..
సావో పౌలో స్పోర్ట్స్ క్లబ్, గౌరాని జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. సావో పౌలో జట్టుకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు విలియమ్ రైబెరోకు మ్యాచ్ రిఫరీ ఫౌల్ చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విలియమ్ రిఫరీని కింద పడేసి తలపై తన్నాడు. గ్రౌండ్‌లోనే చితకబాదాడు.