తెలంగాణ

telangana

ETV Bharat / sports

నెయ్​మర్​పై అత్యాచార ఆరోపణల కేసు మూసివేత - బ్రెజిల్ ఫుట్​బాల్ ఆటగాడు నెయ్​మర్

బ్రెజిల్ ఫుట్​బాల్ ఆటగాడు నెయ్​మర్​పై వచ్చిన అత్యాచార ఆరోపణల కేసును బ్రెజిల్ పోలీసులు మూసివేశారు. సరైన ఆధారాలు లేకపోవటమే కారణమని అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకటించింది.

బ్రెజిల్ ఫుట్​బాల్ ఆటగాడు నెయ్​మర్

By

Published : Jul 30, 2019, 4:39 PM IST

ఆధారాలు సరిగా లేని కారణంగా బ్రెజిల్ ఫుట్​బాల్ ఫ్లేయర్ నెయ్​మర్​పై ఉన్న అత్యాచార ఆరోపణల కేసు మూసివేస్తున్నట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. దీనిపై జడ్జి 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావల్సి ఉంటుంది.

మే నెలలో పారిస్​లోని ఓ హోటల్​లో తనపై అఘాయిత్యం చేశాడని నెయ్​మర్​పై ఆరోపణలు చేసింది నజిలా ట్రిండానే అనే బ్రెజిల్ మహిళ. ఈ విషయాన్ని నెయ్​మర్ తీవ్రంగా వ్యతిరేకించాడు.

ఈ ఆరోపణలు కొన్ని వారాలుగా దేశంలో తీవ్ర దుమారం రేపాయి. కోపా అమెరికా టోర్నీ కోసం బ్రెజిల్ ప్రభుత్వమే కావాలని ఈ కేసు కొట్టి వేసిందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

అత్యాచార ఆరోపణలకు వ్యతిరేకంగా నెయ్​మర్ జూన్ 2న ఏడు నిమిషాల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఆమెతో పరిచయం మాత్రమే ఉందని తెలిపాడు. నెయ్​మర్ వీడియోలో వాట్సాప్ సందేశాలు, ట్రిండాడేతో ఉన్న ఫోటోలను పంచుకున్నాడు.

ఇది సంగతి: 'దీపా ఒలింపిక్స్​ పర్యటనపై ఇప్పుడే ఏం చెప్పలేం'

ABOUT THE AUTHOR

...view details