తెలంగాణ

telangana

ETV Bharat / sports

నెయ్​మర్ లేకుండానే ఒలింపిక్స్​కు బ్రెజిల్ - నెయ్​మర్ టోక్యో ఒలింపిక్స్

డిఫెండింగ్ ఛాంపియన్ బ్రెజిల్​ టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympic) కోసం జట్టును ప్రకటించింది. గత మెగాటోర్నీలో కెప్టెన్​గా వ్యహరించిన ఈ జట్టు స్టార్ ప్లేయర్ నెయ్​మర్​(Neymar)కు ఇందులో చోటు దక్కలేదు. ప్రస్తుతం కోపా అమెరికా టోర్నీతో బిజీగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది జట్టు.

p Neymar
నెయ్​మర్

By

Published : Jun 18, 2021, 8:32 AM IST

Updated : Jun 18, 2021, 9:53 AM IST

ఐదుసార్లు ​ప్రపంచ ఛాంపియన్‌, ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అయిన బ్రెజిల్ ఫుట్​బాల్ జట్టు అనుహ్య నిర్ణయం తీసుకుంది. ఈ జట్టు స్టార్ ఆటగాడు నెయ్​మర్Neymar) లేకుండానే టోక్యో ఒలింపిక్స్​(Tokyo Olympic)లో పాల్గొనేందుకు సిద్ధమైంది. తాజాగా మెగాటోర్నీకి ప్రకటించిన జట్టులో నెయ్​మర్​తో పాటు మరో స్టార్ ప్లేయర్ మర్కినోస్​కు మొండిచేయి చూపించింది మేనేజ్​మెంట్. అలాగే 38 ఏళ్ల డేనియల్ అల్వ్​స్​తో పాటు 31 ఏళ్ల గోల్ కీపర్​ సాంటోస్​, డిఫెండర్​ డియాగో కార్లోస్​ను జట్టులోకి తీసుకున్నారు.

2016లో సొంతగడ్డపై జరిగిన రియో ఒలింపిక్స్​లో స్వర్ణం పతకం సాధించింది బ్రెజిల్. ఫైనల్లో జర్మనీపై 5-4 తేడాతో గెలిచి గోల్డ్ దక్కించుకుంది. ఈ టోర్నీలో జట్టుకు కెప్టెన్​గా వ్యహరించిన నెయ్​మర్​ ఎన్నో కీలక గోల్స్​తో అలరించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఈ జట్టుకు ఇదే తొలి ఒలింపిక్ గోల్డ్. అంతకుముందు మూడు రజతాలు, రెండు కాంస్యాలు గెలుచుకుంది.

నెయ్​మర్ అందుకే..

ప్రస్తుతం కోపా అమెరికా టోర్నీలో ఆడుతున్నాడు నెయ్​మర్. ఈ టోర్నీ జులై 10 వరకు జరగనుంది. జులై 23న ఒలింపిక్స్ ఫుట్​బాల్ మ్యాచ్​లు మొదలవుతాయి. దీంతో ఇతడు మెగాటోర్నీకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

​ఈ ఏడాది ఒలింపిక్స్​లో గ్రూప్-డిలో ఉంది బ్రెజిల్. ఈ జట్టుతో పాటు ఈ గ్రూప్​లో జర్మనీ, సౌదీ అరేబియా, ఐవరీ కోస్ట్ ఉన్నాయి.

జట్టు

గోల్​ కీపర్: సాంటోస్, బ్రెన్నో

డిఫెండర్స్ : డానీ అల్వ్​స్, గాబ్రియేల్ మెనినో, అరానా, గాబ్రియేల్ మగల్హాస్, నినో, డిగో కార్లోస్

మిడ్ ఫీల్డర్స్ : డగ్లస్ లూయిజ్, బ్రూనో గుమేరస్, గెర్సన్, క్లాడిన్హో, మాథ్యూ హెన్రిక్స్

ఫార్వర్డ్స్ :మాథ్యూ కన్హా, మల్కోమ్, ఆంటోనీ, పాలిన్హో, పెడ్రో.

Last Updated : Jun 18, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details