బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి మరో కీలక పదవికి ఎంపికయ్యాడు. రాబోయే సీజన్ ఇండియన్ సూపర్ లీగ్‌లో ప్రముఖ ద్వయం ఏటీకే-మోహన్ బగన్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్ డైరెక్ట్ర్స్లో సభ్యుడుగా చోటు లభించింది. జులై 10న భేటీ కానున్న సభ్యులు.. క్లబ్‌కు కొత్త పేరు, జెర్సీ, లోగో అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత బోర్డు డైరెక్టర్లలో ఒకరైన ఉత్సవ్ పరేఖ్ దీనిని స్పష్టం చేశారు. గంగూలీ ఈ ఫ్రాంచైజీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు 100 శాతం అర్హుడని అన్నారు.
ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్స్‌లో గంగూలీ - Ganguly as ATK-Mohun Bagan directors
ఏటీకే-మోహన్ బగన్ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగా ఎంపికయ్యాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఈ బాధ్యతలు చేపట్టేందుకు దాదా 100 శాతం అర్హుడని సహ డైరెక్టర్ ఉత్సవ్ అన్నారు.
గంగూలీ
ప్రస్తుతం ఉత్సవ్ పరేఖ్, శ్రిన్జోయ్ బోస్, దెబాశిష్ దత్తా, గౌతమ్ రేయ్, సంజీవ్ మెహ్రా సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఐఎస్ఎల్ టైటిల్‌ను మూడు సార్లు, ఐ-లీగ్ ట్రోఫీని రెండుసార్లు ముద్దాడింది ఏటీకే క్లబ్.
ఇది చూడండి :'ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ మాకు 'యాషెస్''
Last Updated : Jul 5, 2020, 10:00 PM IST