అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఆరోసారి ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య) ఉత్తమ క్రీడాకారుడి అవార్డును అందుకున్నాడు. ఈ పురస్కార వేడుక సోమవారం(డిసెంబర్ 2న) పారిస్‌లో జరిగింది. 32 ఏళ్ల ఈ సాకర్ స్టార్ ఆరోసారి ఈ అవార్డును సాధించి.. చిరకాల ప్రత్యర్థి క్రిస్టియాన్ రొనాల్డోను అధిగమించాడు. రొనాల్డో ఇప్పటికే 5సార్లు ఈ ఘనత సాధించాడు.
ఆరు పురస్కారలతో లియోనెల్ మెస్సీ రికార్డుల రారాజు...
గతంలోనూ ఈ పురస్కారం హ్యాట్రిక్ సార్లు తీసుకుని దిగ్గజాల సరసన నిలిచాడు మెస్సీ. బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ స్టార్ ప్లేయర్.. ఈ ఏడాది 54 మ్యాచ్‌ల్లో 46 గోల్స్ సాధించాడు. లాలిగా మ్యాచ్‌ల్లో 34 సార్లు బరిలోకి దిగి 36 గోల్స్ చేశాడు. గతేడాది తన జట్టుకు లాలిగా, కోపా డెల్ రే, యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగుసార్లు, 2015లో మరోసారి ఈ పురస్కారం అందుకున్నాడు మెస్సీ. ఈ అవార్డు మొదటిసారి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి 6 సార్లు విజేతగా నిలిచాడు. పదేళ్లు దిగ్విజయంగా సాకర్‌లో రాణిస్తున్నాడు.
మెస్సీ రికార్డులు ఆరు టైటిళ్లతో మెస్సీ రొనాల్డోకు దక్కలేదు..
గతంలో...ఫ్రాన్స్ సాకర్ దిగ్గజం మైఖేల్ ప్లాటినీ 1983, 84, 85 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు బలోన్ డి'ఓర్ అవార్డును అందుకుని 'హ్యాట్రిక్'ను సాధించాడు. ఇదే తరహాలో 2009, 2010 సంవత్సరాల్లో ఉత్తమ ఆటగాడిగా ఎంపికైన మెస్సీ.. 2011లోనూ అవార్డు సాధించి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
మైదానంలో ఇతడికి చిరకాల ప్రత్యర్థి అయిన క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ పురస్కారాన్ని ఐదుసార్లు అందుకున్నాడు. 2008, 2013, 2014, 2016, 2017 సంవత్సరాల్లో ఈ ఘనత సాధించాడు రొనాల్డో. ఐదుసార్లు ఈ పురస్కారం అందుకున్న రొనాల్డో మాత్రం హ్యాట్రిక్ సాధించలేకపోయాడు. 2018లో క్రొయేషియాకు చెందిన లుకా మోడ్రిక్ ఆ ఏడాది అద్భుత ప్రదర్శనతో రొనాల్డో రికార్డుకు బ్రేక్ వేశాడు.