క్రిస్టియానో రొనాల్డో తన పాత క్లబ్లో మళ్లీ చేరిపోయాడు. ఈ విషయాన్ని మాంచెస్టర్ యునైటెడ్ అధికారికంగా ప్రకటించింది. జువెంటిస్ నుంచి రొనాల్డోను బదిలీ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సంతోషంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పాత గూటికి రొనాల్డో.. సంబరాల్లో ఫ్యాన్స్ - క్రిస్టియానో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్
క్రిస్టియానో రొనాల్డో తన పాత క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని క్లబ్ ధ్రువీకరించింది.
రొనాల్డో
రొనాల్డో ఐదుసార్లు బాలోన్ డీ ఓర్ విజేత. తన కెరీర్లో 30 మేజర్ ట్రోఫీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇందులో ఐదు యురోపియన్ ఛాంపియన్స్ లీగ్, నాలుగు ఫిఫా ప్రపంచకప్, ఏడు ఇంగ్లాండ్ లీగ్ టైటిల్స్ ఉన్నాయి. అలాగే మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 292 మ్యాచ్‌లు ఆడిన ఇతడు 118 గోల్స్ సాధించాడు.
జువెంటిస్ మేనేజర్ మ్యాక్స్ అలెగ్రీ ఈ విషయంపై శుక్రవారమే స్పష్టతనిచ్చారు. రొనాల్డోకు జువెంటిస్లో కొనసాగేందుకు ఆసక్తి లేదని తెలిపారు.