అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఆరోసారి ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య) ఉత్తమ క్రీడాకారుడి అవార్డును అందుకునే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఈ పురస్కారానికి ఇతడే ఎంపికవుతాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే కెరీర్లో ఆరోసారి ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. గతంలోనూ ఈ పురస్కారం హ్యాట్రిక్ సార్లు తీసుకొను దిగ్గజాల సరసన నిలిచాడీ స్టార్ ప్లేయర్. ఫ్రాన్స్ వేదికగా డిసెంబర్ 2న జరగనున్న వేడుకలో అవార్డు విజేతను ప్రకటించనుంది ఫిఫా.
- 22 ఏళ్ల వయసులో బలోన్ డి'ఓర్ పురస్కారాన్ని తొలిసారి అందుకున్నాడు మెస్సీ. 2009-10 కాలంలో ఈ అవార్డు తీసుకున్నాడు. బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ ప్లేయర్.. ఆ జట్టుకు లా లిగా, కోపా డెల్ రే, యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు.
- 2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగుసార్లు ఈ అవార్డు అందుకున్నాడు మెస్సీ. 2015లో మరోసారి ఈ పురస్కారం తీసుకుని ఐదోసారి ఉత్తమ ఆటగాడిగా ఘనత సాధించాడు. మైదానంలో ఇతడికి చిరకాల ప్రత్యర్థి అయిన క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ పురస్కారాన్ని ఐదుసార్లు అందుకున్నాడు. 2008, 2013, 2014, 2016, 2017 సంవత్సరాల్లో ఈ ఘనత సాధించాడు రొనాల్డో.
- బుధవారం(నవంబర్ 27న) యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో బార్సిలోనా జట్టు తరఫున 700వ సారి మైదానంలో అడుగుపెట్టాడు మెస్సీ. ఈ మ్యాచ్లో బొరూసియా డార్ట్ముండ్తో తలపడిందీ జట్టు. ఇందులో ఒక గోల్ నమోదు చేశాడు. ఫలితంగా తన జట్టు 3-1 తేడాతో గెలిచింది.
- యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో మొత్తం 34 జట్లపై గోల్స్ చేసిన ఆటగాడిగా అర్జెంటీనాకు చెందిన మెస్సీ రికార్డు సృష్టించాడు.
గతంలో...