తెలంగాణ

telangana

ETV Bharat / sports

బార్సిలోనా ఆటగాళ్లతో లియోనల్​ మెస్సీ ప్రాక్టీస్​.. - messi training at barcelona

దిగ్గజ ఫుట్​బాల్​ ప్లేయర్​ లియోనల్​ మెస్సీ.. మళ్లీ బార్సిలోనా తరఫునే ఆడనున్నాడు. క్లబ్​ను వీడనని గతవారమే క్లారిటీ ఇచ్చిన ఈ అర్జెంటీనా స్టార్​.. ఇవాళ మైదానంలో ప్రాక్టీస్​లో పాల్గొన్నాడు. క్లబ్​లోని సహచర అటగాళ్లతో కలిసి మైదానంలో కనువిందు చేశాడు.

messi latest news
బార్సిలోనా క్లబ్​ ఆటగాళ్లతో లియోనల్​ మెస్సీ ప్రాక్టీస్​..

By

Published : Sep 9, 2020, 6:32 PM IST

అర్జెంటీనా సూపర్​స్టార్​, ప్రముఖ ఫుట్​బాల్​ క్రీడాకారుడు లియోనల్​ మెస్సీ.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. బార్సిలోనా ఎఫ్​సీకి గుడ్​బై చెప్పాలకున్న ఆయన.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు. తాజాగా అదే జట్టుతో కలిసి ట్రైనింగ్​ సెషల్​లో పాల్గొన్నాడు. ఆ సమయంలో తీసిన ఫొటోను అభిమానులతో పంచుకుంది క్లబ్​ యాజమాన్యం.

యూటర్న్​..

విభేదాల కారణంగా మెస్సీ ఈ సీజన్‌ నుంచే బార్సిలోనాకు దూరం కావాలనుకున్నాడు. కానీ కాంట్రాక్టు ప్రకారం అతడు 2021 చివరి వరకు తమతో ఉండాల్సిందేనని, లేదంటే 837 మిలియన్‌ డాలర్లు చెల్సించాల్సి వుంటుందని సదరు క్లబ్ స్పష్టం చేసింది. కోర్టుల వెంట తిరిగే కంటే.. ఈ ఏడాదికి క్లబ్​ తరఫునే ఆడాలని నిర్ణయించుకున్నాడు మెస్సీ. ఈ సీజన్‌ ముగిసే వరకు మాత్రమే జట్టుతో ఉండనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details