ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనాకు శస్త్రచికిత్స జరిగింది. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైనట్లు అతని వ్యవహారాలు చూసుకునే బృందం ప్రకటించింది. ఇది ఆరోగ్య సమస్యల వల్ల వచ్చిందా..? ఏదైనా ప్రమాదం వల్ల వచ్చిందా? అనేది తనకు గుర్తులేదని మారడోనా చెప్పినట్లు అతని వ్యక్తిగత వైద్యుడు లీపోల్డో పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనాకు శస్త్రచికిత్స - డీగో మారడోనాకు బ్రెయిన్ సర్జరీ
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనాకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. కనీసం 48 గంటలపాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజానికి 'శస్త్రచికిత్స'
ఈ అర్జెంటీనా దిగ్గజం కనీసం 48 గంటల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. గత శుక్రవారం 60వ పుట్టినరోజు చేసుకున్న మారడోనా.. ప్రస్తుతం జిమ్నాసియా ఎస్‌గ్రేమా ఫుట్‌బాల్ క్లబ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి:బట్టతలను ఫుట్‌బాల్‌గా భావించిన ఏఐ కెమెరా