2027లో ఫుట్‌బాల్ ఆసియాకప్ నిర్వహించేందుకు భారత్‌తో పాటు మరో నాలుగు దేశాలు పోటీపడుతున్నట్లు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఉజ్భెకిస్థాన్ ఉన్నాయి.
"ఈ వేలంలో పాల్గొన్న దేశాలతో ఏఎఫ్సీ కలిసి పనిచేస్తుంది. 2021లో ఆసియాకప్‌కు సంబంధించిన ఆతిథ్యదేశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు"
- షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీమ్ అల్ కలీఫా, ఏఎఫ్సీ అధ్యక్షుడు
ఈ టోర్నీ నిర్వహించేందుకు ఐదు దేశాలు పోటీపడుతుండగా.. అందులో రెండింటికి ఇప్పటికే రెండుసార్లు ఆతిథ్యమిచ్చిన అనుభవం ఉంది. ప్రస్తుత ఛాంపియన్ ఖతార్.. 1988, 2011లో జరిపింది. ఆసియాకప్ ఫుట్‌బాల్ చరిత్రలో 1968, 1976లో సొంతగడ్డపై రెండుసార్లు కప్‌ను గెలుచుకున్న ఏకైక దేశంగా ఇరాన్ ఘనత సాధించింది.
మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సౌదీ అరేబియా.. 2022లో ఏఎఫ్సీ మహిళా ఆసియాకప్‌ను నిర్వహించే హక్కులు పొందిన భారత్, అండర్-19 ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చిన ఉజ్భెకిస్థాన్.. ఇలా అన్ని దేశాలు తొలిసారి ఈ టోర్నీ నిర్వహించేందుకు పోటీ పడుతున్నాయి.
ఇదీ చూడండి... ఇంగ్లాండ్ చేరిన పాక్ క్రికెటర్లకు కరోనా నెగటివ్