స్కాట్లాండ్లోని ఓ ఫుట్‌బాల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది. గోల్ సాధించేందుకు రెండు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడుతున్నారు. కానీ, ఆ దృశ్యాలేవీ చూపించట్లేదు. మ్యాచ్ సాంతం లైన్ బయట జెండా పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్న రిఫరీ దృశ్యాలు మాత్రమే కనిపించాయి. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన అభిమానులు.. టీవీల్లో మ్యాచ్‌ను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణం.. ఆ రిఫరీ బట్టతల అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ, అదే నిజం.
బట్టతలను ఫుట్‌బాల్‌గా భావించిన ఏఐ కెమెరా - కృత్రిమ మేధ
కరోనా కాలం.. స్టేడియాల్లోకి వెళ్లేందుకు అవకాశం లేదు. అంతా టీవీల్లో మ్యాచ్‌లను చూసి ఆనందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్.. క్రీడాభిమానులను తీవ్ర అసహనానికి గురి చేసింది. అత్యాధునిక సాంకేతికతతో ఈ చిక్కు తలెత్తింది! అసలింతకీ ఏం జరిగిందంటే...
ఆ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన కృత్రిమ మేధతో నడిచే అత్యాధునిక కెమెరా అతని బట్టతలను ఫుట్‌బాల్‌గా భావించడమే దానికి కారణం. కెమెరామెన్ అవసరం లేకుండా మైదానంలో బంతి కదలికలను బట్టి మ్యాచ్‌ను రికార్డు చేయడం కోసం ఈ కెమెరాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మొదట్లో గొప్పగా చెప్పుకున్నారు. కానీ, ఇటీవల ఐసీటీ, యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్‌లో బంతిని రికార్డు చేస్ ప్రోగ్రామ్‌తో రూపొందించిన ఆ కెమెరా.. రిఫరీ బట్టతలను బంతిగా అనుకుని అతని కదలికలను మాత్రమే నిక్షిప్తం చేసింది. దీంతో అభిమానులు నిర్వాహకులపై మండిపడుతున్నారు. వచ్చే మ్యాచ్‌లో ఆ రిఫరీ ఓ టోపీ ధరించేలా చూడండంటూ సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుస్తున్నారు.
ఇదీ చూడండి:సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేనా?