తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛెత్రి 15 ఏళ్ల కెరీర్​లో చెరిగిపోని రికార్డులెన్నో ! - సునీల్​ ఛెత్రి తాజా వార్తలు

ఆటలో ఎన్నో రికార్డులు సృష్టించిన స్టార్ ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రి.. కెరీర్​లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి ఫుట్​బాల్​ ప్రయాణం ఎలా ప్రారంభమైంది ? సాధించిన ఘనతలు ఏంటి?

15 years of Sunil Chhetri.. he achieved many success and most respectable awards
సాకర్​ ఐకానిక్​ ఛెత్రి: 15 ఏళ్ల కెరీర్​లో ఎన్నో విజయాలు, పురస్కారాలు​

By

Published : Jun 12, 2020, 12:37 PM IST

Updated : Jun 12, 2020, 12:45 PM IST

దిగ్గజ ఫుట్​బాలర్, భారత కెప్టెన్​ సునీల్​ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. జూన్ 12తో 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్​ను ​పూర్తి చేసుకున్నాడు​. 2005లో జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన ఇతడు.. భారత్‌ తరఫున ఇప్పటివరకు 115 మ్యాచ్‌ల్లో 72 గోల్స్‌ కొట్టాడు. స్టార్ ఆటగాడు‌ క్రిస్టియానో రొనాల్డో (99) తర్వాత అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసిన వాడిగా రికార్డు సృష్టించాడు. 'ఆసియా ఐకానిక్'​గా పేరు తెచ్చుకుని, దేశంలోనే అత్యధిక గోల్స్​ కొట్టిన ఫుట్​బాలర్​గా నిలిచాడు.

చిన్న వయసు నుంచే..

ఛెత్రి చిన్న వయసులోనే ఫుట్​బాల్​ ఆడటం మొదలుపెట్టాడు. 2002లో మోహన్​ బగన్​ జట్టు​తో కెరీర్​ ప్రారంభించాడు. అనంతరం జేసీటీకి ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో భాగంగా 48 మ్యాచ్​ల్లో 21 గోల్స్ చేశాడు.

వారిలో మూడో వ్యక్తి

కనాస్​ సిటీ విజార్డ్స్​ మేజర్​​ సాకర్ లీగ్ 2010 ఒప్పందం మేరకు ముస్సోరి వెళ్లిన ఛెత్రి.. స్వదేశం నుంచి విదేశాలకు వెళ్లిన ఆటగాళ్లలో మూడో వ్యక్తిగా నిలిచాడు. ఎంఎల్​ఎస్​లో ఎక్కువకాలం కొనసాగలేక తిరిగి ఐ- లీగ్​ వైపు దృష్టి సారించాడు. అనంతరం డి పోర్చుగల్​ స్పోర్ట్స్​ క్లబ్​ ఒప్పందం మేరకు ఐరోపా వెళ్లాడు.

అంతర్జాతీయ స్థాయిలో

ఛెత్రి అద్భుతమైన ప్రదర్శనతో.. భారత్​ 2007, 2009, 2012 నెహ్రూ కప్​లను సొంతం చేసుకుంది. 2011 ఎస్​ఏఎఫ్​ఎఫ్​ చాంపియన్​షిప్​ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా 27 ఏళ్ల తర్వాత 2008 ఏఎఫ్​సీ ఛాలెంజ్ కప్​ను సాధించి చరిత్ర సృష్టించింది.

ఛెత్రి గురించి మరిన్ని విశేషాలు..

2011 ఏఎఫ్​సీ ఆసియాకప్​లో భారత కెప్టెన్​గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రెండు గోల్స్​ చేశాడు.

2007, 2011, 2013, 2014, 2017, 2018-19 సంవత్సరాల్లో రికార్డు సృష్టించిన ఛెత్రి.. ఏఐఎఫ్​ఎఫ్​ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆరుసార్లు నిలిచాడు.

ప్రత్యేక గుర్తింపులు

  • ఏఐఎఫ్​ ఆఫ్​ ది ఇయర్​: 2007,2011,2013,2014,2017,2018-19
  • ఎఫ్​పీఏఐ ఇండియన్​ ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​: 2009,2018
  • ఏఎఫ్​సీ ఛాలెంజ్​ కప్​ మోస్ట్ వాల్యూబుల్​ ప్లేయర్​:2008
  • ఎస్​ఏఎఫ్​ఎఫ్​ ఛాంపియన్​షిప్​ ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​: 2011
  • హీరో ఆఫ్​ ది ఐ-లీగ్​: 2016-2017
  • హీరో ఆఫ్​ ది ఇంటర్​కాంటినెంటల్​​ కప్​: 2018

పురస్కారాలు

  • 2011: అర్జున అవార్డు
  • 2018: ఎఫ్​సీ ఏసియన్​ ఐకాన్​
  • 2019: పద్మశ్రీ
  • 2019: దిల్లీ ఫుట్​బాల్​ అసోసియేషన్​​ రత్న అవార్డు(మొదటి గ్రహీత)

ఇదీ చూడండి:'ఆటను ఆస్వాదిస్తున్నా.. ఇప్పట్లో దూరం కాను'

Last Updated : Jun 12, 2020, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details