బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో జింబాబ్వే జట్టు విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 143 పరుగులకే ఆలౌట్ చేసి 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను సమం చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మాధ్వేరే(73) అర్ధశతకంతో అలరించగా.. డియోన్ మైయర్స్(26), రైయాన్ బుర్ల్(34) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు పడగొట్టగా.. మహేది హసన్, షకిబుల్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.
అదరహో.. జింబాబ్వే చేతిలో బంగ్లాదేశ్ చిత్తు
జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆడిన రెండో టీ20లో బంగ్లాదేశ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. జింబాబ్వే లాంటి పసికూనపై 23 పరుగుల తేడాతో బంగ్లా జట్టు ఓడింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ను జింబాబ్వే జట్టు సమం చేసింది.
అనంతరం 167 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మొహమ్మద్ నయీమ్(5), సౌమ్య సర్కార్(8) వెంటనే వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జింబాబ్వే బౌలర్ల ధాటికి ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. షామిమ్ హుస్సేన్(29) టాప్ స్కోరర్. లుకే జాంగ్వీ, వెల్లింగ్టన్ మసకడ్జా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. టెండాయ్ చతార, బ్లెస్సింగ్ ముజరబాని చెరో 2 వికెట్లు సాధించింది. దీంతో బంగ్లా టీమ్ 19.5 ఓవర్లలో 143 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 23 పరుగులు తేడాతో రెండో టీ20లో జింబాబ్వే గెలుపొందింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను జింబాబ్వే జట్టు 1-1తో సిరీస్ సమం చేసింది.
ఇదీ చూడండి..ఒలింపిక్స్లో రెండో రోజు.. బరిలో తెలుగు తేజాలు