PCB New Chairman : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మేనేజ్మెంట్ కమిటీ కొత్త ఛైర్మన్‌గా జకా అష్రాఫ్ నియమితులయ్యారు. మొత్తం నాలుగు నెలలపాటు ఆయన ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు. పది మంది సభ్యులతో కూడిన బోర్డు మేనేజ్మెంట్ కమిటీకి ఆయన సారథ్యం వహించనున్నారని ప్రముఖ క్రిక్ ఇన్ఫో వెబ్సైట్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో అష్రాఫ్‌తో పాటు కలీమ్ ఉల్లా ఖాన్, అషాఫక్ అక్తర్, ముస్సాదిక్ ఇస్లాం, అజ్మత్ పర్వేజ్, జహీర్ అబ్బాస్, ఖుర్రం సూమ్రో, ఖవాజా నదీమ్, ముస్తఫా రామ్‌డే జుల్ఫికర్ మాలిక్ ఉన్నారు. అయితే జకా అష్రాఫ్కు సంబంధించి అధ్యక్ష ఎన్నికను నిలిపేయాలని ఇటీవలే బలూచిస్తాన్ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 17 వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ 10 రోజులకే అష్రాఫ్‌ను తాత్కాలికంగా మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.
PCB New Chairman : పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా జకా అష్రాఫ్.. నాలుగు నెలలే.. - Zaka Ashraf news
PCB New Chairman : పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ కమిటీకి నూతన ఛైర్మన్‌గా జకా అష్రాఫ్ నియమితులయ్యారు. ఈయన మొత్తం నాలుగు నెలలపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌కు సంబంధించి వివిధ న్యాయపరమైన అంశాలు ఉండటం వల్ల గత కొంత కాలంగా కోర్టుల్లో ఈ అంశంపై పలు వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దీని వల్ల ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. అందుకే నాలుగు నెలల పాటు అష్రాఫ్‌ను పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ కొత్త ఛైర్మన్‌గా నియమిస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కమిటీలో పాకిస్థాన్ మాజీ బ్యాటర్ జహీర్ అబ్బాస్ కూడా ఉన్నారు. మరోవైపు పీసీబీ చీఫ్ మారడం ఆరు నెలల కాలంలో ఇది మూడవసారి. ఈ ఏడాది ఆరంభంలో రమీజ్ రజాను తప్పించి సేథీకి బాధ్యతలు అప్పగించగా.. ఇప్పుడు సేథీ స్థానంలో అష్రాఫ్ వచ్చాడు. ఈయన 2011 నుంచి 2014 వరకు పీసీబీ అధ్యక్షునిగా పని చేశాడు.
ఇటీవలే ఆసియా కప్-2023 నిర్వహణకు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ నజామ్ సేథీ ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' తనకు నచ్చలేదంటూ పీసీబీ కొత్త చైర్మన్ జకా ఆష్రాఫ్ చేసిన కీలక వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏసీసీ ఆమోదం తెలిపిన హైబ్రిడ్ మోడల్ వల్ల పాకిస్థాన్‌కు నష్టం జరుగుతుందని.. తనకీ విధానం ఏమాత్రం నచ్చలేదని ఆష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ ఆసియా కప్ జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధత మళ్లీ నెలకొన్న నేపథ్యంలో ఈ మోడల్ తిరస్కరణపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను వేరే దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణను ఇచ్చుకున్నారు.