టీమ్ఇండియా స్పిన్నర్, ఆర్సీబీ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ సామాజిక మాధ్యమాల్లో ఎంతో హుషారుగా ఉంటాడు. అతని సతీమణి ధనశ్రీ వర్మ కూడా అంతే ఉత్సాహంతో సోషల్ మీడియాలో తన వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ కరోనా రెండో వేవ్‌తో రద్దవ్వడం వల్ల అభిమానులతో పాటు ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఆటగాళ్లు కూడా సామాజిక మధ్యమాల్లో తరుచూ వీడియోలు చేస్తూ తమ అభిమానులను అలరిస్తున్నారు.
చాహల్ భార్య స్టెప్పులు అదరహో! - చాహల్ భార్య ధనశ్రీ డ్యాన్స్ వీడియో
టీమ్ఇండియా స్పిన్నర్, ఆర్సీబీ ఆటగాడు చాహల్ సతీమణి ఓ డ్యాన్స్ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
![చాహల్ భార్య స్టెప్పులు అదరహో! Chahals wife Dhanashree](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11812203-364-11812203-1621387165749.jpg)
చాహల్ భార్య ధనశ్రీ
కొరియోగ్రఫర్, యూట్యూబర్‌గా ఫేమస్ అయిన ధనశ్రీ తాజాగా ఆర్సీబీ జెర్సీ ధరించి ప్రఖ్యాత అమెరికన్ ర్యాపర్ సౌలిజా బాయ్స్ రూపొందించిన షి మేక్ ఇట్ క్లాప్ అనే పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియోకి రెండు గంటల్లోనే రెండు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని మీరు కూడా చూసేయండి మరి!