Chahal record at lords: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డే విజయంతో ఉత్సాహంగా బరిలోకి దిగిన రోహిత్ సేన రెండో వన్డేలో ఓటమి పాలైంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. ఆఖరి వన్డే మ్యాచ్ ఆదివారం జరగనుంది. రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (4/47) ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 39 ఏళ్ల కిందట రికార్డును చాహల్ బద్దలు కొట్టాడు. అదేంటో చూద్దాం..
- 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక లార్డ్స్ స్టేడియం. విండీస్‌పై చిరస్మరణీయ విజయం సాధించిన కపిల్ నేతృత్వంలోని భారత్ తొలిసారి కప్‌ను సొంతం చేసుకుంది. అయితే విండీస్ నడ్డివిరచడంలో మొహిందర్ అమర్‌నాథ్ కీలక పాత్రపోషించాడు. అద్భుతమైన బౌలింగ్ స్పెల్ 3/12తో అదరగొట్టాడు. ఇదే ఇప్పటి వరకు లార్డ్స్‌లో ఓ భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన. అయితే తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ (4/47) ఆ రికార్డును అధిగమించాడు.