సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయేముందు లేదా విడాకులు తీసుకునేముందు సోషల్ మీడియాలో ఇంటిపేరును తొలగించడం ట్రెండ్ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా ధనశ్రీ కూడా తన పేరులో చాహల్ పదాన్ని తొలగించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన సోషల్‌మీడియా ఖాతా పేరు ఇంతకుముందు ధన్‌శ్రీ చాహల్ అని ఉండేది. అయితే ఇప్పుడు అందులో నుంచి చాహల్ పేరును తొలగించి ధనశ్రీ వర్మ అని పెట్టుకుంది. దీంతో ఒకప్పుడు తమ రొమాంటిక్ చిత్రాలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈ జోడీ.. తాజాగా సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా, నిజమెంత
టీమ్ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ధనశ్రీ చేసిన ఓ పని ఆ అనుమానాలకు తావిచ్చింది. అయితే, దీనిపై చాహల్ వివరణ ఇచ్చాడు.
మరోవైపు, చాహల్ కూడా ఇటీవలే సోషల్ మీడియాలో పంచుకున్న ఓ పోస్ట్ కూడా వైరల్ అయింది. 'కొత్త జీవితం లోడ్ అవుతోంది' అంటూ ఇన్‌స్టా రీల్లో ఓ ఫొటోను పంచుకున్నాడు చాహల్. ఇవన్నీ చూస్తుంటే చాహల్ ధనశ్రీ బంధానికి బ్రేకులు పడ్డాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, ఓ కోర్టులో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేశారని ట్వీట్లు చేశారు.
చాహల్ క్లారిటీ
అయితే, ఈ ప్రచారాలు శ్రుతిమించిన నేపథ్యంలో చాహల్ స్పష్టతనిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టేటస్ పెట్టాడు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న రూమర్స్‌ను ఎవరూ నమ్మొద్దని పేర్కొన్నాడు. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశాడు.