టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.. ఓవైపు క్రికెటర్‌గా మరోవైపు చక్కటి ఫ్యామిలీ మ్యాన్‌గానూ కెరీర్లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న అతడు మంచి ఫామ్‌లోకి వచ్చాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన హిట్‌మ్యాన్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఖుషీ అయిన అభిమానులు రోహిత్ పేరుతో సోషల్‌మీడియాలోనూ హోరెత్తించారు. అయితే ఈ క్రమంలోనే రోహిత్ శర్మ లవ్‌స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది.
రోహిత్ శర్మ-రితికా సింగ్(rohit sharma ritika love story) ఎంతో చూడచక్కని జంట. రితిక.. హిట్‌మ్యాన్‌కు మేనేజర్‌గా పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. కొంతకాలం తర్వాత 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి మధ్య పరిచయం ఎలా మొదలైంది? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? లవ్‌ట్రాక్ ఎలా సాగింది?
ఇలా కలిశారు.. యూవీ వార్నింగ్
రోహిత్.. రితికను ఓ యాడ్ షూట్ సందర్భంగా కలిశాడు. ఈమె భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు(rohit sharma yuvraj singh) సోదరి వరుస అవుతుంది. ఆ సమయంలో ఓసారి రితికకు దూరంగా ఉండాలంటూ యూవీ హిట్‌మ్యాన్‌ను హెచ్చరించాడట! అయితే ఆ తర్వాత ఆమె రోహిత్‌కు మేనేజర్‌గా మారింది. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం, ఆరేళ్ల పాటు డేటింగ్, ఆ తర్వాత పెళ్లి జరిగింది.
ప్రపోజ్ ఇలా..
అది ఓ ఐపీఎల్ సీజన్. ఆ సమయంలో బొరివలీ స్పోర్ట్ గ్రౌండ్లో రోహిత్-రితికా ఎప్పటిలానే కలిసి ఉన్నారు. ఆ సమయంలోనే హిట్‌మ్యాన్ తన మోకాలి మీద కూర్చొని, రింగ్‌ను చూపిస్తూ తన ప్రేమను తెలియజేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత 2015 జూన్ 3న పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థం. 2015 డిసెంబరు 13న ముంబయిలోని తాజ్ లాండ్స్ హోటల్లో కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరికీ సమైరా అనే పాప ఉంది. తను అంటే రోహిత్‌కు ప్రాణం. ఖాళీ దొరికినప్పుడల్లా తనతోనే కలిసి ఉంటూ చిన్నపిల్లాడిలా మారి ఆడుకుంటూ ఉంటాడు. అందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటాడు.
ఇదీ చూడండి:రోహిత్ రికార్డు.. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ నుంచి ఒక్కడే