తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్‌ కెప్టెన్సీకి యువరాజ్‌ సింగ్‌ రేటింగ్‌.. ఎంత ఇచ్చాడో తెలుసా! - క్రీడా వెబ్‌సైట్‌ రోహిత్‌ కెప్టెన్సీపై పోల్‌

టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్‌ శర్మపై మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ క్రీడా వెబ్‌సైట్‌ రోహిత్‌ కెప్టెన్సీపై పోల్‌ను నిర్వహించింది. దీనికి యువరాజ్‌ సింగ్‌ ఇచ్చిన రేటింగ్‌ ఎంతంటే..?

yuvraj singh
రోహిత్‌ కెప్టెన్సీ

By

Published : Dec 6, 2022, 10:54 PM IST

కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోని వైదొలిగిన తర్వాత టీమ్‌ఇండియా ముందు ఉన్న ఏకైక లక్ష్యం ఐసీసీ ట్రోఫీని గెలవడమే. రోహిత్‌ శర్మ నేతృత్వంలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌ తోనూ ఈ కల నెరవేరలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ ముంగిట బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ వైఫల్యం బయటపడింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ అంశంపై యువరాజ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ క్రీడా వెబ్‌సైట్‌ రోహిత్‌ కెప్టెన్సీపై పోల్‌ను నిర్వహించింది. దీనిపై నెటిజన్లు తమ స్పందనను రేటింగ్‌ రూపంలో తెలియజేశారు. ఈ పోల్‌లో యువరాజ్‌ సింగ్‌ సైతం పాల్గొని ఆశ్చర్యపరిచాడు. రోహిత్‌ కెప్టెన్సీకి తాను పదికి పది మార్కులు ఇస్తానని కామెంట్ చేశాడు. జాతీయ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శనలు చేసిన రోహిత్‌కు యువీ ఇచ్చిన రేటింగ్‌ సరైందేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details