టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ను వెనక్కు (Yuvraj Singh Comeback) తీసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ.. పబ్లిక్ డిమాండ్ మేరకు తిరిగి (Yuvraj Singh Return) ఆడనున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు. దాంతో పాటే 2017 జనవరిలో ఇంగ్లాండ్‌పై చేసిన 150 పరుగులకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.
"దేవుడు మీ విధిని నిర్ణయిస్తాడు. ప్రజల కోరిక మేరకు నేను ఫిబ్రవరిలో పిచ్ మీదకు అడుగుపెట్టే అవకాశం ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. టీమ్ఇండియాకు మద్దతిస్తూ ఉండండి. నిజమైన అభిమాని కఠిన పరిస్థితుల్లోనే జట్టుకు అండగా నిలుస్తారు."
- యువరాజ్ సింగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అయితే భారత జట్టుకు ఆడతాడా, లేదా టీ20 లీగుల్లో పాల్గొంటాడా అనేది యువీ స్పష్టం చేయలేదు. 2011 ప్రపంచకప్‌లో (2011 World Cup Man of The Series) ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన యువరాజ్.. 2019 జూన్‌లో (Yuvraj Singh Retirement) అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలికాడు.