కరోనా రోగుల అత్యవసర చికిత్స కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో 1000 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు యువరాజ్ సింగ్ ఫౌండేషన్ యూవీకెన్ ప్రకటించింది. ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్లు, ఇతర ముఖ్యమైన వైద్య పరికరాలు సమకూర్చడం ద్వారా.. ప్రభుత్వ, ఛారిటబుల్ హాస్పిటల్స్ సామర్థ్యాన్ని పెంచాలన్నది ఫౌండేషన్ ఉద్దేశమని తెలిపింది.
ఆస్పత్రిల్లో 1000 పడకలు.. యూవీ ఫౌండేషన్ ఏర్పాటు - యువరాజ్ ఫౌండేషన్
కొవిడ్-19 రోగుల కోసం దేశవ్యాప్తంగా 1000 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు మాజీ క్రికెటర్ యువరాజ్ ఫౌండేషన్ యూవీకెన్ ప్రకటించింది. వీటితో పాటు ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సమకూర్చనున్నట్లు తెలిపింది.
ఆస్పత్రిల్లో 1000 పడకలు.. యూవీ ఫౌండేషన్ ఏర్పాటు
కరోనా రెండో దశలో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు దొరక్క ప్రజలు పడ్డ ఇబ్బందులు చూశాక మన ఆరోగ్య వ్యవస్థకు మద్దతివ్వాలని భావించినట్లు యువరాజ్ చెప్పాడు. యూవీకెన్ ఫౌండేషన్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పడకలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది.
ఇదీ చూడండి:టీ20 ప్రపంచకప్: బీసీసీఐకి ఐసీసీ డెడ్లైన్!