తెలంగాణ

telangana

ETV Bharat / sports

Yuvraj Singh: లైగర్​తో యువీ​ వార్​!.. ఎవరు గెలిచారంటే? - దుబాయ్ వార్తలు

ఫీల్డ్​లో దిగితే బౌలర్లకు చుక్కలు చూపించే యువరాజ్ సింగ్ (Yuvraj Singh).. ఇటీవలే ఓ లైగర్​తో పోటీపడ్డాడు. దుబాయ్​ ఫేమ్​ పార్క్​ సందర్శన సందర్భంగా లైగర్​తో టగ్​ ఆఫ్​ వార్​లో దిగిన యువీ.. గెలిచాడో లేదో చూడండి మరి.

yuvraj singh news
యువరాజ్ సింగ్

By

Published : Oct 3, 2021, 6:26 PM IST

క్రికెట్​లో విధ్వంసకర బ్యాట్స్​మన్​గా పేరున్న యువరాజ్​ సింగ్​ (Yuvraj Singh).. రిటైర్​మెంట్​ అనంతరం లైఫ్​ను ఎంజాయ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నాడు. ఇటీవలే దుబాయ్​లోని (Yuvraj Singh Dubai) ఫేమ్​ పార్క్​ను సందర్శించిన యువీ.. అక్కడ ఓ లైగర్​లో పోటీ పడ్డాడు. స్నేహితులతో కలిసి దానితో టగ్​ ఆఫ్​ వార్ చేశాడు. కానీ లైగర్​ ముందు నిలవలేకపోయింది యువీ బృందం. టూర్​కు సంబంధించిన విశేషాలను ఆదివారం తన ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు యువరాజ్.

పార్క్​లో యువీ

"టైగర్​ వర్సెస్ లైగర్​.. తుది ఫలితం మీకు అందరికీ తెలుసు (నవ్వుతూ). భయాలన్నీ పక్కనపెట్టి అడవి అసలు స్వభావాన్ని అనుభూతి చెందాను. గొప్ప అనుభవం పొందాను."

- యువరాజ్ సింగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఆ తర్వాత పార్క్​ మొత్తం సరదాగా కలియతిరిగాడు యువీ (Yuvraj Singh News). ఓ భారీ పామును తను భయపడుతూనే మెడలో వేసుకున్నాడు. ఎలుగుబంటి, కోతి, ఇతర అడవి జంతువులకు ఆహారం తినిపించాడు. యువీ చేసిన సందడి సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.

పాముతో యువరాజ్
జంతువులకు ఆహారం తినిపిస్తూ

2019 జూన్​లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు యువరాజ్ (Yuvraj Singh Retirement). టీమ్​ఇండియా.. 2007లో టీ20 ప్రపంచకప్​, 2011 వన్డే ప్రపంచకప్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

పార్క్​లో సరదాగా యువీ

ఇదీ చూడండి:ధోనీ 'కింగ్ కాంగ్'​ లాంటోడు: రవిశాస్త్రి

ABOUT THE AUTHOR

...view details