తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంతరిక్షంలోకి యువరాజ్​ సింగ్ తొలి సెంచరీ​ బ్యాట్​

Yuvraj Singh bat goes to space: టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ అరుదైన ఫీట్​ను అందుకున్నాడు. అతడు తొలిసారి శతకం బాదిన బ్యాట్ అంతరిక్షంలోకి పంపించింది ఆసియాకు చెందిన ఓ ఎన్​ఎఫ్​టీ మార్కెట్​ కలెక్షన్​ సంస్థ.​

Yuvraj Singh bat sent to space, అంతరిక్షంలోకి యువరాజ్​ సింగ్ తొలి సెంచరీ​ బ్యాట్​
అంతరిక్షంలోకి యువరాజ్​ సింగ్​ బ్యాట్​

By

Published : Dec 26, 2021, 3:39 PM IST

Yuvraj Singh bat goes to space: టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ మరో అరుదైన ఘనత సాధించాడు. అతడు తొలిసారి సెంచరీ చేసిన బ్యాట్​ అంతరిక్షంలోకి వెళ్లింది. ఆసియాకు చెందిన ఓ ఎన్​ఎఫ్​టీ మార్కెట్​ కలెక్షన్​​ సంస్థ ఈ బ్యాట్​ను పంపించింది. దీనికి సంబంధించిన వీడియోను సదరు సంస్థ షేర్​ చేసింది. స్పేస్​లోకి వెళ్లిన తొలి బ్యాట్​ ఇదే కావడం విశేషం.

ఈ విషయమై యూవీ మాట్లాడుతూ.. "నా బ్యాట్​ అంతరిక్ష ప్రయాణం చేయడం చాలా థ్రిల్లింగ్​గా ఉంది. ఈ ప్లాట్​ఫాంలో చేరడం వల్ల నా అభిమానులతో అనుబంధం మరింత పెరుగుతుంది. ఈ బ్యాట్​తోనే నేను తొలి శతకం బాదాను" అని అన్నాడు.

యూవీ తొలి సెంచరీ

కాగా, 2003లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన ఓ వన్డే మ్యాచ్​లో యువరాజ్​ సింగ్ తన​ తొలి సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుత బీసీసీఐ ఛైర్మన్​ గంగూలీ సారథ్యంలోని అప్పటి టీమ్​ఇండియా.. ఆ మ్యాచ్​లో 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 27వ ఓవర్​లో బ్యాటింగ్​కు దిగిన యూవీ.. కేవలం 85 బంతుల్లోనే 9ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. అనంతరం భారత జట్టు.. బంగ్లాదేశ్​ను 76 రన్స్​కే ఔట్​ చేసింది.

ఇదీ చూడండి: వార్మప్ మ్యాచ్​లే టీమ్ఇండియాకు ప్రమాణం కాదు: యువరాజ్

ABOUT THE AUTHOR

...view details