భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్.. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ మల్గ్రేవ్ జట్టు తరఫున ఆడనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ముల్గ్రేవ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయేగమ్ తెలిపారు.
" ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు దిల్షాన్, సనత్ జయసూర్య, తరంగాలు మల్గ్రేవ్ జట్టులో ఆడనున్నారు. ఇంకొంత మంది సమర్థమంతమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు కృషి చేస్తున్నాం. మల్గ్రేవ్ జట్టులో ఆడేందుకు యువరాజ్, గేల్లు దాదాపు సుముఖంగా ఉన్నారు" అని మిలాన్ చెప్పారు.