UAE T10 league 2023 : యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టీ10 లీగ్‌లో యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. జోబర్గ్ బఫ్పాలోస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 26 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 80 అజేయ పరుగులు చేశాడు. ఒంటి చేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
శుక్రవారం డర్బన్ ఖలాండర్స్ - జోబర్గ్ బఫ్పాలోస్ మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ ఖలాండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్(39), ఆసిఫ్ అలీ(32*) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆ తర్వాత 141 పరుగల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన జోబర్గ్ జట్టు ఒక బంతి మగిలి ఉండగానే.. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
yusuf pathan T10 league : యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్.. ఓ దశలో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో వెళ్లింది జోబర్గ్ జట్టు. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన యూసఫ్ పఠాన్ జట్టును ఆదుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్(14 *) సాయంతో జట్టుకు అదిరేటి విజయాన్ని అందించాడు. జోబర్గ్ జట్టు విజయానికి చివరి 18 బంతుల్లో 64 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో యూసఫ్.. 14 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఔరా అనిపించాడు.