తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​ బంతి తగిలి యువ క్రికెటర్​ మృతి - cricketer died by ball

క్రికెట్​ బాల్ తగిలి ఓ యువ క్రికెటర్​ ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. ఎక్కడ జరిగిందంటే.

cricketer died by hitting ball
బంతి తగిలి యువ క్రికెటర్​ మృతి

By

Published : Aug 20, 2022, 10:58 AM IST

Updated : Aug 20, 2022, 11:21 AM IST

క్రికెట్​ ఆడటానికి మైదానానికి వెళ్లిన ఓ యువకుడు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ యువకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన దిల్లీలోని స్వరూప్​ నగర్​లో జరిగింది.

ఇదీ జరిగింది.. కోల్​కతాకు చెందిన హబీబ్​ మండల్(30) స్నేహితులతో కలిసి ఓ స్కూల్​ క్యాంపస్​లో మ్యాచ్​ ఆడటానికి​ దిల్లీ వచ్చాడు. అయితే ఆట మధ్యలో క్రికెట్​ బాల్​ అతడి ఛాతికి బలంగా తాకడంతో అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

మృతిచెందిన యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారు వచ్చిన తర్వాత మృతుడికి ఇదివరకే ఏమైనా ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత దర్యాప్తు ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:పాక్​తో మ్యాచ్​పై రోహిత్​ వ్యాఖ్యలు, పరిస్థితులకు అలవాటుపడితేనే

Last Updated : Aug 20, 2022, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details