Youngest IPL Captain :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ ఐపీఎల్లో ప్రమోషన్ పొందాడు. 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సారథ్యం వహించనున్నాడు. అయితే టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ట్రేడవడం వల్ల.. గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
" రెండేళ్లుగా శుభ్‌మన్ గిల్ అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపించేందుకు శుభ్‌మన్ గిల్ రెడీ. ఈ కొత్త జర్నీ స్టార్ట్ చేయనున్న గిల్‌కు శుభాకాంక్షలు" అని ట్విట్టర్లో పేర్కొంది. దీనిపై స్పందించిన గిల్.. "గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అవ్వడం గర్వంగా ఉంది. నాపై నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. రెండు సీజన్లు ఆడిన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తా" అని అన్నాడు.
అయితే శుభ్‌మన్ గిల్ 24 ఏళ్లకే జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అతిచిన్న వయసులో కెప్టెన్సీ చేపట్టే ప్లేయర్ల లిస్ట్‌లో టాప్ 10లో చేరాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే అతి తక్కువ వయసులో జట్టుకు కెప్టెన్సీ వహించిన రికార్డు కొట్టాడు. మరి ఆ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న కెప్టెన్లు ఎవరో తెలుసుకుందామా?
- https://www.instagram.com/p/C0KFk7ih7UO/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
విరాట్ కోహ్లీ | 22 ఏళ్లు | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 2011 |
స్టీవ్ స్మిత్ | 22 ఏళ్లు | పుణె వారియర్స్ ఇండియా | 2012 |
సురేశ్ రైనా | 23 ఏళ్లు | చెన్నై సూపర్ కింగ్స్ | 2010 |
శ్రేయస్ అయ్యర్ | 23 ఏళ్లు | దిల్లీ క్యాపిటల్స్ | 2018 |
రిషభ్ పంత్ | 23 ఏళ్లు | దిల్లీ క్యాపిటల్స్ | 2021 |
రషీద్ ఖాన్ | 23 ఏళ్లు | గుజరాత్ టైటాన్స్ | 2022 |
దినేశ్ కార్తిక్ | 24 ఏళ్లు | దిల్లీ క్యాపిటల్స్ | 2010 |
శామ్ కరన్ | 24 ఏళ్లు | పంజాబ్ కింగ్స్ | 2023 |
శుభ్‌మన్ గిల్ | 24 ఏళ్లు | గుజరాత్ టైటన్స్ | 2024 |