దేశంలో రెండో దశ కరోనా నానాటికీ ప్రాణాంతకంగా మారుతోన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్లు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. వారిలో సారథి విరాట్ కోహ్లీ సహా విధ్వంసకర బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ యాజమాన్యం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
"హాయ్.. నేను విరాట్ కోహ్లీ. ఒక కెప్టెన్గా నేను ముందుండి నడిపిస్తాను. చుట్టూ ఉన్నవాళ్లకు సహకరిస్తాను. మీరందరు కూడా అలాగే చేయాలని కోరుతున్నా. చేతులను శుభ్రపరచుకోండి. అవసరమైతేనే బయటకు వెళ్లండి. అన్ని వేళలా మాస్కులు ధరించండి."
- విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్
సూపర్ హీరోలా..