2020కి సంబంధించి భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ప్రకటించిన పరిహారం ఇంకా అందించలేదు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ). అందుకు సంబంధించిన ప్రణాళిక రాష్ట్రాల నుంచి రాకపోవడమే చెల్లింపులు ఆలస్యమవ్వడానికి కారణమని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు.
"మేము రాష్ట్రాలతో చర్చించాల్సి ఉంది. ఎందుకంటే ఎవరెన్ని మ్యాచ్‌లు ఆడారు? ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి? రిజర్వ్‌లో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఎంత? అనే విషయాల గురించి రాష్ట్రాలు సమాచారం పంపాల్సి ఉంది. కానీ, ఇంతవరకు ఏ ఒక్క రాష్ట్రం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపలేదు. అందుకే చెల్లింపులు ఆలస్యమయ్యాయి" అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.