Yash Dhull Ranji Trophy: టీమ్ఇండియా అండర్-19 వరల్డ్‌కప్ కెప్టెన్‌గా అదరగొట్టి, జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన యశ్‌ధుల్.. రంజీల్లో కూడా దుమ్మురేపుతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం నమోదు చేసిన ధూల్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మరో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీల్లో అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత నారీ కాంట్రాక్టర్, విరాగ్ అవతేల పేరిట ఉంది.
దిల్లీకి ఆడుతున్న ధుల్.. తమిళనాడుతో మ్యాచ్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో 200 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 13 బౌండరీలు ఉన్నాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులు చేశాడు.
మళ్లీ ఫామ్‌లోకి..