తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ప్రైజ్​ మనీ ప్రకటించిన ఐసీసీ.. గెలిస్తే అన్ని కోట్లా?

WTC Prize Money : వరల్డ్ ​టెస్ట్​ ఛాంపియన్​షిప్ 2021-23కు సంబంధించి ప్రైజ్​ మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. మరి ఏ టీమ్​కు ఎంత దక్కనుందంటే..

WTC prize money
వరల్డ్​టెస్ట్​ ఛాంపియన్​షిప్ ప్రైజ్​ మనీ

By

Published : May 26, 2023, 5:06 PM IST

Updated : May 26, 2023, 5:55 PM IST

WTC Prize Money : వరల్డ్​టెస్ట్​ ఛాంపియన్​షిప్ 2021-23 టోర్నీకి ప్రైజ్​ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ సీజన్​కు సంబంధించి విజేతతో సహా మిగిలిన ఎనిమిది జట్లకు కలిపి ప్రైజ్​ మనీని 3.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.31 కోట్లు)గా నిర్ణయించింది. ఇంతకుముందు జరిగిన 2019-21 టోర్నీలో కూడా 3.8 మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీ అందించింది. వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్ ఫైనల్ విజేత 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.13 కోట్లు), రన్నరప్​గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6.4 కోట్లు) బహుమతిగా అందించనుంది.

డబ్ల్యూటీసీ విజేతతో పాటు టోర్నీలో పాల్గొన్న ఆయా జట్లకు వాటి స్థానాలను బట్టి అందనున్న ప్రైజ్​మనీ.

స్థానం జట్టు ప్రైజ్ ​మనీ (రూ. సుమారు కోట్లు/లక్షల్లో)
విజేత భారత్​/ఆస్ట్రేలియా 16 లక్షల డాలర్లు (రూ.13 కోట్లు)
రెండో స్థానం భారత్​/ఆస్ట్రేలియా 8 లక్షల డాలర్లు (రూ.6.4 కోట్లు)
మూడో స్థానం దక్షిణాఫ్రికా 4.5 లక్షల డాలర్లు (రూ.3.6 కోట్లు )
నాలుగో స్థానం ఇంగ్లాండ్ 3.5 లక్షల డాలర్లు (రూ.2.8 కోట్లు)
ఐదో స్థానం శ్రీలంక 2 లక్షల డాలర్లు (రూ.1.6 కోట్లు)
ఆరో స్థానం న్యూజిలాండ్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
ఏడో స్థానం పాకిస్థాన్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
ఎనిమిదో స్థానం వెస్టిండీస్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
తొమ్మిదో స్థానం బంగ్లాదేశ్​ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)

జూన్ 7-11 తేదీల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఐపీఎల్​ ముగించుకున్న టీమ్​ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాడ్ చేరుకుని.. ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్​ చేసింది. ఈ వీడియోలో టీమ్​ఇండియా ఆటగాళ్లు కొత్త కిట్​ స్పాన్సర్ 'అడిడాస్' స్పోర్ట్స్ వేర్​లో కనిపించారు.
కాగా మొదటి డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్​లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలన్న కసితో బరిలో దిగనుంది. ఇక ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన అనంతరం పూర్తి టీమ్ఇండియా జట్టు ప్రాక్టీస్​కు అందుబాటులో ఉండనుంది.

Last Updated : May 26, 2023, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details