ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. సోషల్ మీడియాలోనూ చురుకుగానే వ్యవహరిస్తున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోలను షేర్ చేశారు.
ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్, సిరాజ్‌తో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ. 'ఈ పేసర్లు ప్రతి రోజు ఆధిపత్యం చెలాయిస్తున్నారు' అనే క్యాప్షన్‌ను దాని కింద పెట్టాడు. మరో ఆటగాడు బుమ్రా.. ఓపెనర్ రోహిత్‌తో పాటు పుజారా, రిషభ్ పంత్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'మరొక గొప్ప ప్రాక్టీస్ సెషన్ తర్వాత మా అందరి నవ్వులు' అని దాని కింద రాసుకొచ్చాడు.
ఇదీ చదవండి:'ఆ విషయంలోకి సెలెక్టర్లను అనవసరంగా లాగారు'
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్, కివీస్.. తగినంత ప్రాక్టీస్ సాధించాయి. టీమ్ఇండియా మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్కోరు బోర్డును వెల్లడించలేదు బీసీసీఐ. రోజు వారీగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వివరాలతో పాటు ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల పేర్లను తెలిపింది.
మరో జట్టు న్యూజిలాండ్.. ప్రతిష్ఠాత్మక ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడింది. తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో మ్యాచ్‌లో పర్యటక కివీస్ గెలుపొందింది. దీంతో 22 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్‌ను కైవసం చేసుకుంది న్యూజిలాండ్. జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. జూన్ 23ను రిజర్వ్ తేదీగా ప్రకటించింది ఐసీసీ.
ఇదీ చదవండి:ICC: టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రైజ్‌మనీ ఎంతంటే?