తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final: కివీస్​కు స్వల్ప ఆధిక్యం.. 249కు ఆలౌట్​ - ఇండియా vs న్యూజిలాండ్ మ్యాచ్ అప్​డేట్లు

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​లో న్యూజిలాండ్ 249 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. దీంతో 32 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. 54 పరుగులు చేసిన కాన్వే కివీస్ టాప్ స్కోరర్.

wtc final, india vs new zealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్

By

Published : Jun 22, 2021, 8:54 PM IST

Updated : Jun 22, 2021, 9:10 PM IST

సౌథాంప్టన్ వేదికగా భారత్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​లో న్యూజిలాండ్ 249పరుగులకు ఆలౌట్​ అయ్యింది. కేన్​(49) పరుగులు చేయగా.. చివర్లో సౌథీ(30) స్వేచ్ఛగా ఆడటం వల్ల విలువైన 32 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది కేన్​సేన. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 4, ఇషాంత్ 3, అశ్విన్​ 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. కేన్​ సేన ఆలౌట్​ అయిన అనంతరం టీ విరామం తీసుకున్నారు ఇరుజట్ల ఆటగాళ్లు.

గేర్​ ఛేంజ్​..

135/5తో భోజన విరామానికి వెళ్లిన కేన్​ సేన.. తర్వాత పరుగులు చేయడానికి ప్రాముఖ్యత ఇచ్చింది. వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించిన గ్రాండ్ హోమ్​ను షమి ఎల్బీగా పెవిలియన్​ పంపాడు. ఆ తర్వాత.. ఓ ఎండ్​లో కేన్​ బంతిని డిఫెన్స్​ చేస్తుండగా మరో ఎండ్​లో ఉన్న బ్యాట్స్​మన్​ పరుగులు చేస్తూ వెళ్లారు. గ్రాండ్​హోమ్​ తర్వాత క్రీజులోకి వచ్చిన జేమీసన్​(21) ధాటిగా ఆడాడు. అతన్ని కూడా షమినే వెనక్కి పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సౌథీ.. విలియమ్సన్​కు మంచిగా సహకరించాడు. ఈ క్రమంలోనే భారత్​ స్కోరును దాటేసింది కివీస్. హాఫ్​ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో కెప్టెన్ విలియమ్సన్(177 బంతుల్లో 49 పరుగులు)​ స్లిప్​లో దొరికిపోయాడు. తర్వాత వచ్చిన వాగ్నర్​ను అశ్విన్​ ఔట్​ చేశాడు.

చివర్లో న్యూజిలాండ్​ అంత ఆధిక్యాన్ని సాధించిందంటే.. అది సౌథీ వల్లేనని చెప్పుకోవాలి. క్రీజులోకి వస్తూనే హిట్టింగ్​ మొదలుపెట్టాడు సౌథీ. ఈ క్రమంలో విలువైన పరుగులను రాబట్టి జట్టుకు అండగా నిలిచాడు. చివరికి జడేజా బౌలింగ్​లో ఔటయ్యాడు.

అంతకుముందు.. మొదటి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 217 పరుగులకు ఆలౌట్​ అయ్యింది.

ఇదీ చదవండి:పాక్​ బ్యాటింగ్​ కోచ్​ పదవికి యూనిస్​ గుడ్​ బై​

Last Updated : Jun 22, 2021, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details