తెలంగాణ

telangana

ETV Bharat / sports

శునకంతో రవిశాస్త్రి క్యాచ్​ల ప్రాక్టీస్.. వీడియో వైరల్ - రవిశాస్త్రి శునకంతో వీడియో

టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి​ ఓ శునకంతో క్యాచ్​లు పట్టిస్తున్న వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశాడు. టెన్నిస్ బంతిని ఎక్కడికి కొడితే అది అక్కడికి పరుగెత్తికెళ్లి క్యాచ్​ పడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

ravi shastri, playing catch with a dog
రవిశాస్త్రి, శునకంతో క్యాచ్​ల ప్రాక్టీస్

By

Published : Jun 15, 2021, 5:05 PM IST

టీమ్ఇండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి తన ట్విట్టర్​ ఖాతాలో ఓ సరదా వీడియోను షేర్​ చేశాడు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ అనంతరం గ్రౌండ్​లో విన్సన్​(శునకం)తో క్యాచ్​లు పట్టిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. రవిశాస్త్రి.. ఓ టెన్నిస్ బంతిని ఎక్కడికి కొడితే అక్కడికి పరుగెత్తుకెళ్లి క్యాచ్​లు పడుతుంది విన్సన్.

ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీమ్ఇండియా ఇంట్రా స్క్వాడ్​ మ్యాచ్​తో ప్రాక్టీస్​ను కూడగట్టుకోగా.. కివీస్​ జట్టు ఇంగ్లాండ్​తో రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్ ఆడింది.

ఇదీ చదవండి:డబ్ల్యూటీసీ ఫైనల్​ ఒకే మ్యాచ్​​.. ఐసీసీ వివరణ

ABOUT THE AUTHOR

...view details