ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో వర్షం కారణంగా నాలుగో రోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
వెలుతురులేమి కారణంగా మూడో రోజు ఆట తొందరగా ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. రాస్ టేలర్, విలియమ్సన్ క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లు ఇషాంత్, ఆశ్విన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలి రోజు కూడా ఆట వర్షార్పణమైపోయింది. రెండో రోజు ప్రారంభం కాగా. టాస్ ఓడి బ్యాంటింగ్ కు దిగిన కోహ్లీసేన.. మొత్తం మీద 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది.