సౌథాంప్టన్ వేదికగా కివీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (12 బంతుల్లో 8 పరుగులు), పుజారా (55 బంతుల్లో 12 పరుగులు) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీసుకున్నాడు.
WTC Final: ఇక రిజర్వ్ డే పైనే.. టీమ్ఇండియా@64/2
ఇంగ్లాండ్ వేదికగా భారత్-కివీస్ మధ్య జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ త్వరగానే ఔట్ అయ్యాడు. క్రీజులో పుజారా(12*), కోహ్లీ (8*) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీసుకున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్
ఐదో రోజు మూడో సెషన్లో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తొలి వికెట్‌కు ఓపెనర్ల జంట 24 పరుగులు జోడించింది. శుభ్‌మన్ గిల్ (33 బంతుల్లో 8 పరుగులు)ను.. ఎల్బీగా పెవిలియన్ పంపి కివీస్‌కు తొలి వికెట్‌ను అందించాడు సౌథీ. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా ఆచితూచి ఆడుతున్నాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన రోహిత్‌ను (81 బంతుల్లో 30 పరుగులు) సౌథీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఇదీ చదవండి :బుమ్రా బౌలింగ్ సీక్రెట్‌పై ఐసీసీ వీడియో