ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి ఆసక్తికర ప్రకటన చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC). జూన్ 18న జరిగే ఈ మ్యాచ్.. టై, డ్రా అయితే ఇరుజట్లను విజేతగా ప్రకటిస్తామని ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. అలానే ఆరో రోజును రిజర్వ్ డేగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన ఐదురోజుల్లో ఏదైనా ఓరోజు ఆటంకం ఏర్పడితే, దానిని ఆరో రోజు నిర్వహిస్తారు.
wtc final: అదే జరిగితే విజేతగా భారత్, న్యూజిలాండ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(world test championship) విజేతను నిర్ణయించే విధానంపై ఐసీసీ(ICC) కీలక ప్రకటన చేసింది. ఒకవేళ మ్యా డ్రా, టై అయితే ఆడిన రెండు జట్లను విజేతగా ప్రకటిస్తామని తెలిపింది. జూన్ 18న సౌతాంప్టన్లో ఈ పోరు జరగనుంది.
కోహ్లీ విలియమ్సన్
ప్రస్తుతం స్వదేశంలో క్వారంటైన్లో ఉన్న టీమ్ఇండియా(TEAM INDIA).. మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్తుంది. అనంతరం కొన్నిరోజులకు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి.
Last Updated : May 28, 2021, 12:58 PM IST