ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final)పై స్పందించాడు కివీస్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నెర్. ఇంగ్లాండ్ వేదికగా భారత్‌తో జరగబోయే డబ్ల్యూటీసీ మ్యాచ్ తనకు ప్రపంచకప్ ఫైనల్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రాతినిధ్యం వహించని కారణంగా వాగ్నర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు.
"అవును, డబ్ల్యూటీసీ నాకు ప్రపంచకప్ ఫైనల్ లాంటిది. ఎందుకంటే నేను టీ20ల్లో గానీ, వన్డేల్లో గానీ న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చింది. ఇది మళ్లీ రాకపోవచ్చు. నా వరకైతే ఇది ప్రపంచకప్ ఫైనల్ లాంటిది."
-నీల్ వాగ్నెర్, న్యూజిలాండ్ క్రికెటర్.