WTC Final 2023: ఐపీఎల్ ముగిశాక ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్‍షిప్ ఫైనల్‍పై ఉంది. మూడు నెలల విరామం తర్వాత టీమ్ఇండియా బరిలోకి దిగబోతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టైటిల్ కోసం ఆస్ట్రేలియా జట్టుతో తలపడబోతుంది. జూన్ 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్‍లోని ఓవల్ వేదికగా ఈ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఐపీఎల్ కారణంగా భారత ఆటగాళ్లు లండన్‍కు పలు బ్యాచ్‍లుగా వెళ్లారు. ఇప్పుడు అందరూ చేరుకున్నారు. ప్రధాన జట్టులోని ఆటగాళ్లందరూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
WTC Final Commentators : అయితే టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ టెస్టు ఛాంపియన్‍షిప్ ఫైనల్‍కు అఫీషియల్ టీవీ, డిజిటల్ బ్రాడ్‍కాస్టర్లుగా స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్, డిస్నీ+హాట్‍స్టార్ ఉన్నాయి. తాజాగా ఈ తుదిపోరుకు కామెంటేటర్లుగా ఎవరు వ్యవహరించనున్నారో పూర్తి జాబితాను స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ వెల్లడించింది. సునీల్ గావస్కర్, రవి శాస్త్రి, గంగూలీ, నాసీర్ హుస్సేన్, హర్భజన్ సింగ్ లాంటి దిగ్గజాలు కామెంటరీ చెప్పనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మొత్తంగా ఐదు భాషల్లో ఎవరెవరు కామెంటరీ చేయనున్నారో పూర్తి జాబితాను స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ వెల్లడించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఐదు భాషలకు కామెంటేటర్లు వీళ్లే
- ఇంగ్లీష్ (వరల్డ్ ఫీడ్): సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, మాథ్యూ హెడెన్, నాసీర్ హుసేన్
- హిందీ: గంగూలీ, హర్భజన్ సింగ్, దీప్‍దాస్ గుప్తా, ఎస్.శ్రీశాంత్
- తెలుగు: కౌశిక్ ఎన్‍సీ, ఆశిష్ రెడ్డి, టి.సుమన్, కల్యాణ్ కే
- తమిళం: యే మహేశ్, ఎస్.రమేశ్, ఎల్.బాలాజీ, శ్రీరామ్
- కన్నడ: విజయ్ భరద్వాజ్, శ్రీనివాస ఎం, బి.చిప్లీ, పవన్ దేశ్‍పాండే, సునీల్ జే
మరోవైపు, రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్కు చేరిన టీమ్ఇండియా.. పటిష్ఠ ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవాలని భావిస్తోంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కూడా తమ సన్నాహకాలను ప్రారంభించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఓ సారి తెలుసుకుందాం.