WTC Final 2023 : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో రోజు ఆట పూర్తయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. దీంతో 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్‌లో ఖవాజా (13), వార్నర్ (1), స్మిత్ (34), ట్రావిస్ హెడ్ (18) పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో లబుషేన్ (41*), కామెరూన్ గ్రీన్ (7*) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2 వికెట్లు, సిరాజ్, ఉమేశ్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు.. తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ 151/5 స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్ఇండియా మరో 145 పరుగులు జోడించి 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే, ఆసీస్ బౌలర్లు ప్యాట్ కమిన్స్ 3, మిచెల్ స్టార్క్ 2, స్కాట్ బోలాండ్ 2, కామెరూన్ గ్రీన్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్ తీశారు.