WTC Final 2023 Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకప్పుడు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జట్లను చాలా తేలికగా తీసుకునేది. ఇతర జట్ల ఆటగాళ్లను మాటలతో కవ్విస్తూ ఆటతో అదరగొడుతూ ముప్పు తిప్పలు పెట్టేవారు. కంగారుల చేతిలో భారత్‌కు కూడా ఇలాంటి అనుభవాలే చాలాసార్లు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియాను వాళ్ల సొంతగడ్డపై ఓడించడం అసాధ్యమేమీ కాదని టీమ్ఇండియా నిరూపించింది. రెండుసార్లు వరుసగా కోహ్లీ కెప్టెన్సీలోని టీమ్ఇండియా.. ఆసీస్ గడ్డపై చారిత్రక విజయాలు సాధించింది. ఆ విజయాల తర్వాత కంగారూ జట్టు కూడా టీమ్ఇండియాను చూసి భయపడుతుందని కోహ్లీ తెలిపాడు.
Virat Kolhi Test Captaincy : 2018-19 ఆసీస్ టూర్‌లో కోహ్లీ కెప్టెన్సీలో టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోగా.. 2020-21లో రహానే సారధ్యంలో కూడా చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించింది. అయితే ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు విరాట్ కోహ్లీనే నాయకత్వం వహించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ స్వదేశానికి రావడం వల్ల అజింక్య రహానే టీమ్ఇండియా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడాడు.