WTC Final 2023 ind vs aus : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ ఫైనల్) మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. అయితే ఈ తుదిపోరు కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఏకంగా రెండు పిచ్‌లను సిద్ధం చేసింది. దీంతో.. ఐసీసీ ఎందుకు రెండు పిచ్‌లను ఏర్పాటు చేసిందంటూ అభిమానులు గందరగోళానికి గురౌతున్నారు.
WTC Final 2023 pitch : అయితే ఐసీసీ ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. ఇంగ్లాండ్‌లో చమురు ధరల పెంపుపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నిరసనకారులు.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పిచ్‌ను ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. భద్రతా కారణాల దృష్ట్యా ఓవల్ స్టేడియానికి భారీగా భద్రత ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇంకా ఐసీసీ నిబంధన 6.4లో మార్పులు చేసి.. ప్రత్యామ్నాయ పిచ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
WTC final pitch report : ఒక వేళ ప్రధాన పిచ్‌పై నిరసనకారులు దాడి చేసి పాడు చేస్తే.. దానిపై ఆడటానికి కుదురుతుందో లేదు చెక్ చేస్తారు. ఒక వేళ పిచ్ కండిషన్ సరిగ్గా లేకపోతే.. రెండో పిచ్‌పై ఆడేలా నిర్ణయం తీసుకుంటారు. అయితే దానిపై ఆడాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది.. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, కమిన్స్. వారిద్దరి కలిసి ఆటను కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనేది డిసైడ్ చేస్తారు. వీరితో పాటు ఇంకొంతమంది అధికారులు కూడా నిర్ణయం తీసుకుంటారు.
- ఫస్ట్ స్టేడియంలోని అంపైర్ పిచ్‌పై ఆటను కొనసాగించడం సేఫ్ కాదని నిర్ణయిస్తే.. వెంటనే మ్యాచ్‌ను ఆపేస్తారు. 6.4.1 రూల్ ప్రకారం ఐసీసీ మ్యాచ్ రిఫరీకి.. పిచ్ పరిస్థితి గురించి సమాచారం అందజేస్తారు.
- 6.4.4 నిబంధన ప్రకారం గ్రౌండ్‌లోని అంపైర్లు.. వాతావరణం, పిచ్.. ఆడటానికి అనుకూలంగా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న పిచ్‌కు మరమ్మతులు చేసి.. మ్యాచ్‌ను మళ్లీ కొనసాగించే విషయమై ఐసీసీ రిఫరీతో చర్చిస్తారు. ఇలా మరమ్మతుల చేయడం వల్ల ఓ జట్టుకు లాభం చేకూరుతుందా లేదా అన్న విషయాన్ని కూడా రిఫరీ జాగ్రత్తగా పరిశీలిస్తారు.
- 6.4.7 రూల్ ప్రకారం ఐసీసీ మ్యాచ్ రిఫరీ నిర్ణయంపై చర్చించే సమయంలో.. పరిస్థితి గురించి ఇరు జట్ల కెప్టెన్లు, గ్రౌండ్ అథారిటీకి వివరిస్తారు. ఆ తర్వాత గ్రౌండ్ అథారిటీ హెడ్ సమయాను సారం పరిస్థితిపై పబ్లిక్ అనౌన్స్‌మెంట్ చేస్తారు.