తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final: కివీస్ క్రికెటర్​పై జాతి వివక్ష వ్యాఖ్యలు

భారత్-న్యూజిలాండ్(ind vs nz) డబ్ల్యూటీసీ ఫైనల్​ నుంచి ఇద్దరు అభిమానుల్ని పంపించేశారు. వారిద్దరూ కివీస్ క్రికెటర్​పై జాతివివక్ష వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.

WTC Final
కోహ్లీ

By

Published : Jun 23, 2021, 7:31 AM IST

Updated : Jun 23, 2021, 9:15 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(world test championship final) జాతి వివక్ష వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ కారణంగానే ఇద్దరు వీక్షకుల్ని బయటకు పంపించేశారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది?

సౌథాంప్టన్​ వేదికగా ఐదోరోజు మ్యాచ్​ జరుగుతోంది. రాస్ టేలర్(ross taylor) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో ఉన్న ఇద్దరు వీక్షకులు.. అతడి జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తున్నారని ఓ మహిళ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్​లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తన ట్వీట్​లో పేర్కొంది. దీనిపై స్పందించిన ఐసీసీ జనరల్ మేనేజర్ క్లారీ ఫర్లాంగ్.. వారిని పంపిచేసినట్లు స్పష్టం చేశారు.

న్యూజిలాండ్ జట్టు

గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత బౌలర్​ సిరాజ్​కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడి కొందరు వీక్షకులు.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. వారిని స్టేడియం సిబ్బంది, బయటకు పంపించేశారు.

ఐదోరోజు ఆట పూర్తయ్యేసమయానికి 64/2తో నిలిచి, 32 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమ్​ఇండియా. బుధవారం రిజర్వ్​డే అయిన దృష్ట్యా, ఏం జరుగుతుందో అనేది చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్​ డ్రా, టై అయితే ఇరుజట్లు విజేతగా నిలుస్తాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jun 23, 2021, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details