తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్‌ఇండియా 'WTC 2023-25' షెడ్యూల్ వచ్చేసింది.. విండీస్​ టూర్​తోనే స్టార్ట్!

WTC 2023-25 India Schedule : 2024-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో వెస్టిండీస్​ జట్టుతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌తో భారత్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. మొత్తం షెడ్యూల్​ ఇలా..

wtc 2023-25 india schedule
wtc 2023-25 india schedule

By

Published : Jun 14, 2023, 4:11 PM IST

WTC 2023-25 India Schedule : వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి మూటగట్టుకుంది. లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. అయితే మరికొన్ని రోజుల్లోనే భారత క్రికెట్​ జట్టు.. డబ్ల్యూటీసీ 2023-25 చక్రాన్ని ప్రారంభించనుంది.

WTC 2023-25 Cycle Team India : వచ్చే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ జులైలో సిరీస్‌తోభారత్ డబ్ల్యూటీసీ 2023-25 మ్యాచ్‌లు మొదలవుతాయి. ఈ సారి టీమ్‌ఇండియా మొత్తం 19 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు, బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. భారత్ వెలుపల విండీస్‌తో రెండు, దక్షిణాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది.

టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ 2023-25 షెడ్యూల్

  • విండీస్‌లో భారత్‌ పర్యటన
  • జులై 12-16 తొలి టెస్టు (డొమినికా)
  • జులై 20-24 రెండో టెస్టు (ట్రినిడాడ్)
  • సౌతాఫ్రికాలో భారత్ పర్యటన 2023-24
  • డిసెంబరు 2023- జనవరి 2024.. రెండు టెస్టులు
  • భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన
  • జనవరి/ఫిబ్రవరి 2024.. ఐదు టెస్టులు
  • భారత్‌లో బంగ్లాదేశ్‌ పర్యటన
  • సెప్టెంబరు/అక్టోబరు 2024.. రెండు టెస్టులు
  • భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన
  • అక్టోబరు/నవంబరు 2024.. మూడు టెస్టులు
  • ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన 2024-25 (బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ)
  • నవంబర్‌ 2024-జనవరి 2025.. ఐదు టెస్టులు

India Vs West Indies : కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ కోసం భారత క్రికెట్​ జట్టు.. జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ తొలుత టెస్ట్‌లు, ఆ తర్వాత వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం రాత్రి విడుదల చేసింది.

విండీస్‌ పర్యటన వివరాలు..

  • తొలి టెస్ట్‌- జులై 12-16, విండ్సర్ పార్క్‌, డొమినికా
  • రెండో టెస్ట్‌- జులై 20-24, క్వీన్స్ పార్క్ ఓవల్‌, ట్రినిడాడ్‌
  • జులై 27- తొలి వన్డే, కెన్సింగ్​టన్​ ఓవల్​, బార్బడోస్​
  • జులై 29- రెండో వన్డే, కెన్సింగ్​టన్​ ఓవల్​, బార్బడోస్​
  • ఆగస్ట్‌ 1- మూడో వన్డే, బ్రెయిన్ లారా క్రికెట్​ అకాడమీ, ట్రినిడాడ్‌
  • ఆగస్ట్‌ 3- తొలి టీ20, బ్రెయిన్ లారా క్రికెట్​ అకాడమీ, ట్రినిడాడ్‌
  • ఆగస్ట్‌ 6- రెండో టీ20, నేషనల్​ స్డేడియం, గయానా
  • ఆగస్ట్‌ 8- మూడో టీ20, నేషనల్​ స్డేడియం, గయానా
  • ఆగస్ట్‌ 12- నాలుగో టీ20, బ్రౌవార్డ్​ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా
  • ఆగస్ట్‌ 13- ఐదో టీ20, బ్రౌవార్డ్​ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా

జియో సినిమాలో ఫ్రీగా భారత్​- విండీస్​ సిరీస్​
Jiocinema India Vs West Indies : అయితే భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. జులై 12- ఆగస్ట్‌ 13 వరకు జరిగే ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ అధినేత ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details