WTC 2021-23 Points Table: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. తద్వారా 1-0 తేడాతో సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రెండో ఎడిషన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది ఆసీస్. ఈ ఎడిషన్‌లో తొలి సిరీస్ ఆడుతున్న ఆసీస్‌కు ఈ మ్యాచ్‌లో విజయంతో 12 పాయింట్లతో పాటు 100 పర్సంటేజ్ లభించింది.
అలాగే భారత్‌తో సిరీస్‌ను 2-1తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం చెందడం వల్ల 14 పాయింట్లు, 23.33 పర్సంటేజ్‌తో ఆరోస్థానానికి పడిపోయింది. టీమ్ఇండియా విషయానికి వస్తే.. 42 పాయింట్లు, 58.33 పర్సంటేజ్‌తో నాలుగో స్థానానికి దిగజారిపోయింది. 24 పాయింట్లు, 100 పర్సంటేజ్‌తో శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది.