తెలంగాణ

telangana

ETV Bharat / sports

అతడు ఇంకా క్షమాపణలు చెప్పలేదు: సాహా

Wriddhiman Saha Journalist: తనను బెదిరించిన జర్నలిస్ట్​ మళ్లీ టచ్​లోకి రాలేదని, క్షమాపణలు కూడా చెప్పలేదని అన్నాడు టీమ్​ఇండియా సీనియర్​ వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహా. ఇదే విషయంపై బీసీసీఐతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

wriddhiman saha
వృద్ధిమాన్​ సాాహ జర్నలిస్ట్​

By

Published : Feb 26, 2022, 8:24 AM IST

Wriddhiman Saha Journalist: ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా వ్యవహారం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ జర్నలిస్ట్‌ తనతో టచ్‌లో లేడని, క్షమాపణలు కూడా చెప్పలేదని సాహా చెప్పాడు.

"ఓ జర్నలిస్ట్‌ సందేశాలతో బాధకు గురయ్యా. నేను ఏ పాత్రికేయుడితోనూ అనుచితంగా ప్రవర్తించలేదు. అలానే వారూ ఇబ్బంది పెట్టలేదు. అయితే ఆ జర్నలిస్ట్‌ మాత్రం ఇబ్బంది పెట్టాడు. జర్నలిజం ప్రపంచంలో అలాంటి వ్యక్తులు ఉన్నారని ప్రజలకు తెలిసేలా అతడిని బహిర్గతం చేయాలని అడుగుతున్నారు. అయితే ఆ జర్నలిస్ట్‌ నాతో టచ్‌లోకి రాలేదు. నాకు క్షమాపణలూ చెప్పలేదు" అని సాహా వివరించాడు.

ఇదే విషయంపై బీసీసీఐతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సాహా వెల్లడించాడు. "జర్నలిస్ట్‌ వ్యవహారంపై నేను ట్వీట్‌ చేసిన తర్వాత బీసీసీఐ ఈ-మెయిల్‌ ద్వారా టచ్‌లోకి వచ్చింది. బీసీసీఐ దర్యాప్తు చేస్తోంది. వారికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా. ఇప్పటికే నా విధానం ప్రకారం జర్నలిస్ట్‌ గుర్తింపును వెల్లడించలేను. ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం ఇవ్వాలని భావిస్తా. అందుకే అతడి పేరును బయటకు చెప్పను. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశవాళీతోపాటు ఐపీఎల్‌లో ఆడతా. అయితే శ్రీలంకతో జట్టులోకి తీసుకోకపోవడం షాక్‌కు గురి చేసింది. చివరిసారిగా న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడా. అందుకే లంకతో సిరీస్‌కు ఎంపికవుతానని భావించా. అయితే సెలెక్షన్‌ కమిటీ ఓ నిర్ణయానికొచ్చేసి నన్ను తప్పించింది" అని సాహా పేర్కొన్నాడు.

కాగా, సాహాను బెదరించిన జర్నలిస్ట్​ను కనిపెట్టేందుకు ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిటీ వేసింది బీసీసీఐ. ఈ కమిటీలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభ్​తేజ్ సింగ్ ఉన్నారు. వచ్చే వారం.. వీరు ఈ విషయమై తదుపరి విచారణ చేయనున్నారని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: PKL 2022: ప్రొ కబడ్డీ విజేతగా దబంగ్ దిల్లీ

ABOUT THE AUTHOR

...view details